Thu Mar 19 2026 15:32:45 GMT+0530 (India Standard Time)
చెట్టుకూలి ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మంలోని బ్రాహ్మణ బజారులో జరిగిన ఈ ఘటన చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే..

చెట్టుకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మంలోని బ్రాహ్మణ బజారులో జరిగిన ఈ ఘటన చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు బ్రాహ్మణ బజారులోని ఖాళీ స్థలంలోకి ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ చెట్టు కూలి పక్కనున్న గోడపై పడింది. ఆ గోడ కూలి కిందపడటంతో.. దిగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6) మృతి చెందారు.
Also Read : ఐఎన్ఎస్ రణ్వీర్ లో పేలుడు.. ముగ్గురి మృతి
ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మేయర్ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. గతేడాది అక్టోబర్ లో తెలంగాణలోని గద్వాల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో ఓ ఇంటి గోడకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Next Story

