కూతురికి లిప్ కిస్ పెట్టిన ఐశ్వర్యరాయ్.. నెట్టింట ట్రోలింగ్

అలాంటి ఫొటో చూశాక నెటిజన్లు ఊరుకుంటారా మరి. చ్చణాల్లో ఆ ఫొటోను వైరల్ చేశారు. మేడం మీరు కూడా ఇలా చేస్తారా? అంటూ చాలా మంది..

Update: 2022-11-16 12:05 GMT

aiswarya rai aaradhya

వివాదాలకు ఆమడదూరంలో ఉండే బాలీవుడ్ నటి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ పై నెట్టింట్లో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్ తో ఐశ్వర్య సతమవుతున్నారు. అందుకు కారణం ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోనే. ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ దంపతుల ఏకైక కూతురు ఆరాధ్య. నేడు ఆరాధ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా కుమార్తెకు విషెస్ చెబుతూ.. ప్రేమగా ఆమె పెదాలకు ముద్దు పెడుతోన్న ఫొటోను ఐశ్వర్య షేర్ చేసింది.

అలాంటి ఫొటో చూశాక నెటిజన్లు ఊరుకుంటారా మరి. చ్చణాల్లో ఆ ఫొటోను వైరల్ చేశారు. మేడం మీరు కూడా ఇలా చేస్తారా? అంటూ చాలా మంది నెటిజన్లు ఐశ్వర్యను ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కుమార్తె పెదవులపై ముద్దు పెట్టడం వింతగా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం.. అందులో తప్పేముందంటూ వెనకేసుకొస్తున్నారు. తల్లీకూతుర్ల మధ్య అనుబంధాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటూ వారు ఐశ్వర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది వారిద్దరి మధ్యనున్న ప్రేమను మాత్రమేనని చెబుతున్నారు.



Tags:    

Similar News