రిలీజ్ కు ముందే ఆదిపురుష్ కు అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టేజ్ పై ప్రదర్శన

జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 13న ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రీమియర్..

Update: 2023-04-19 08:34 GMT

tribeca festival

బాహుబలి సిరీస్ తర్వాత.. ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయితే అయ్యాడు కానీ.. ఆ రేంజ్ హిట్ మళ్లీ అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్ మూవీలుగా వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా పడ్డాయి. ఇప్పుడు మైథాలిజికల్ మూవీ ఆదిపురుష్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవ్ దత్తా నాగే కనిపించబోతున్నారు. జూన్ 16న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే.. విడుదలకు ముందే ఆదిపురుష్ ఓ గ్లోబల్ స్టేజ్ పై ప్రీమియర్ కాబోతోంది. న్యూయార్క్ లో జరగబోయే ట్రిబెకా ఫెస్టివల్లో ఆదిపురుష్ ప్రీమియర్ వేయనున్నారు. జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 13న ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రీమియర్ పూర్తైన మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందే గ్లోబల్ స్టేజ్ పై ఆదిపురుష్ ప్రదర్శితం కానుండటం ఆ సినిమాకు, ప్రభాస్ కు దక్కిన అరుదైన గౌరవం. ఆదిపురుష్ టీజర్ ను 3డిలో విడుదల చేయగా.. అది ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు. దాంతో ఇప్పుడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యేవరకు తన తదుపరి సినిమాలు నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకుండా ఆయా సినిమాల దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఆర్డర్స్ వేసినట్లు సమాచారం.


Tags:    

Similar News