ఆదిపురుష్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇక కత్తిమీద సామే

రామాయణాన్ని రామాయణంలా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది ఎంతమాత్రం నచ్చదు. అందునా.. రామాయణం ఆధారంగా ఇప్పటికే

Update: 2023-06-24 08:21 GMT

adipurush world wide collections

ఆదిపురుష్.. మొదటి టీజర్ విడుదల నుంచే వివాదాలు ఎదుర్కొంటున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, శేషు గా సన్నీసింగ్, లంకేష్ గా సైఫ్ లు నటించిన ఈ సినిమా.. తీవ్ర విమర్శల పాలైంది. మోడ్రన్ రామాయణమంటూ దర్శకుడు తీసిన ఈ సినిమా నూటికి 90 శాతం మందికి నచ్చలేదు. తొలుత రామాయణం అని చెప్పి.. తీరా విమర్శలు రావడంతో.. యుద్ధకాండలో ఒక భాగమేనని ఓం రౌత్ తనను తాను సమర్థించుకున్నాడు. రాముడు - రావణుల గెటప్ లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో పాటు.. హాలీవుడ్ సినిమాను తలపించేలా యుద్ధం సీన్లుఉండటం ప్రేక్షకులకు నచ్చలేదు.

రామాయణాన్ని రామాయణంలా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది ఎంతమాత్రం నచ్చదు. అందునా.. రామాయణం ఆధారంగా ఇప్పటికే వచ్చిన సినిమాలతో పోల్చితే.. అసలిది రామాయణంలో భాగమే కాదంటున్నారు కొందరు. మరికొందరు మాత్రం సినిమాను సినిమాలా చూడాలని చెబుతున్నారు. ఇన్ని విమర్శలు, వివాదాల నడుమ కూడా.. మొదటి వారం కలెక్షన్లను అదరగొట్టింది ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల స్క్రీన్లపై ప్రదర్శితమైన ఆదిపురుష్ సినిమా.. తొలిరోజే రూ.140 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రెండు రోజులు కూడా వసూళ్లు భారీగానే రాబట్టింది కానీ.. నాలుగో రోజు నుంచి వసూళ్లలో తేడా కనిపించింది.
తొలివారంలో ఆదిపురుష్ కలెక్షన్లు ఏరియా వారీగా చూస్తే.. తెలంగాణలో రూ.34.25 కోట్లు, రాయలసీమలో రూ.9.03కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.9.66 కోట్లు, తూ.గో లో రూ.5.65 కోట్లు, ప.గో. లో రూ.4 కోట్లు, గుంటూరులో రూ.6.40 కోట్లు, కృష్ణాలో రూ.4.18 కోట్లు, నెల్లూరులో రూ.2.10 కోట్లు వసూళ్లు రాబట్టింది. తెలుగురాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ.75.27 కోట్లు.. గ్రాస్ తో కలిపి రూ.120.35 కోట్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది.
కర్ణాటకలో రూ.11.70 కోట్లు, తమిళనాడులో రూ.2.30 కోట్లు, కేరళలో రూ.82 లక్షలు, హిందీ + రెస్టాఫ్ భారత్ రూ.64.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.23.30 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.178.096 కోట్లు (రూ. 359.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. రూ.240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆదిపురుష్ హిట్ కొట్టాలంటే.. ఇప్పటి నుంచి కత్తిమీద సాము అనే చెప్పాలి. ఈవారం థియేటర్లలో పెద్దసినిమాలేవీ లేకపోయినా.. ఆదిపురుష్ థియేటర్లు ప్రేక్షకులతో ఫుల్ అవ్వడం కష్టమే. మిక్స్డ్ టాక్ లో ఉన్న ఈ సినిమా.. ఇంకా రూ.242 కోట్లు రాబడితేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. దాంతో ఇది జరుగుతుందో లేదోనన్న టెన్షన్లో ఉన్నారు నిర్మాతలు.


Tags:    

Similar News