#AdipurushDisaster : మరీ ఇంత నెగిటివిటీనా.. బుకింగ్స్ కూడా క్యాన్సిల్

రామాయణం తెలిసిన వారికి ఈ సినిమా నచ్చే ఛాన్సే లేదంటూ ట్వీట్స్ చేయడంతో.. చాలా మంది బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

Update: 2023-06-17 10:44 GMT

#AdipurushDisaster

ఆదిపురుష్.. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కొందరు బాగుందంటే.. మరికొందరు బాలేదంటున్నారు. దర్శకుడు ఓం రౌత్ పై మండిపడుతున్నారు. బాహుబలిలో రాజసంతో కనిపించే ప్రభాస్ ను.. రాముడిగా చూపించడంలో విఫలమయ్యారంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమాలో లంకగా చూపించిన భవనంపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. Asgard కి బ్లాక్ పెయింట్ వేసి దానినే లంక చూపించాడంటూ.. ఓం రౌత్ పై మండిపడుతున్నారు.

రామాయణం తెలిసిన వారికి ఈ సినిమా నచ్చే ఛాన్సే లేదంటూ ట్వీట్స్ చేయడంతో.. చాలా మంది బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఇలాంటి రామాయణాన్ని చూపించాలనుకోవట్లేదని చెబుతున్నారు. పిల్లలతో కలిసి సినిమా చూసిన పేరెంట్స్ కూడా ధర్మం అంటే ఏంటో చూసి నేర్చుకుంటారని పిల్లల్ని తీసుకుని వచ్చామని, కానీ సినిమాలో హనుమంతుడి పాత్ర చెప్పిన డైలాగ్ లు ఏమాత్రం బాలేదని చెబుతున్నారు. గతంలో రామాయణం ఆధారంగా తీసిన సినిమాల్లో గానీ, సీరియల్స్ లో గానీ ఇంత చెత్త డైలాగ్ లు లేవని.. రామాయణం గురించి పూర్తి అవగాహన లేకుండా సినిమా తీసి హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. "తైలం నీ బాబుది.. కాలేది కూడా నీ బాబుదే" అని హనుమంతుడి క్యారెక్టర్ చెప్పే డైలాగ్ లు కోపం తెప్పిస్తాయి.
ఇక మొదటి రోజు రూ.138 కోట్లు వసూళ్లు వచ్చాయంటే అది కేవలం సినిమాపై ఆసక్తి వల్లేనంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఒక్క హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్.. ఇప్పుడు ఆదిపురుష్ వరుస డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ హ్యాట్రిక్ డిజాస్టర్ టాక్ నుంచి బయటపడాలంటే.. ప్రభాస్ నెక్ట్స్ మూవీతో అయినా హిట్ కొట్టాలి.


Tags:    

Similar News