సూర్య, జ్యోతిక వెకేషన్ లో ఎంజాయ్.. తూర్పు ఆఫ్రికాలో సేదతీరుతున్న జంట
నటుడు సూర్య, జ్యోతికల జంట వెకేషన్ లో ఫుల్లు ఎంజాయ్ చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ కు వీరిద్దరూ వెళ్లి నేచర్ ను ఆస్వాదిస్తున్నారు.
తమిళ నటుడు సూర్య, జ్యోతిక జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ఇద్దరూ ఏ వేదికపైనైనా ఒకటే చెబుతారు. తన వెనక జ్యోతిక ఉన్నారని సూర్య అంటే..జ్యోతి తనకు అంతా సూర్య అని చెబుతుంది. ఇద్దరు మంచి నటులుగా ఎదిగినా మంచి దంపతలుగా అన్నే మార్కులు కొట్టేశారనండంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా సెలబ్రిటీలు షూటింగ్ లో ఏ మాత్రం విరామం దొరికినా వెంటనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి లాంగ్ ట్రిప్పులు వేస్తుంటారు. పడిన శ్రమంతా మర్చిపోయేందుకు ఇతర ప్రాంతాలకు వెళుతుండటం కామన్.
ఫుల్లు హ్యాపీస్...
తాజాగా నటుడు సూర్య, జ్యోతికల జంట వెకేషన్ లో ఫుల్లు ఎంజాయ్ చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ కు వీరిద్దరూ వెళ్లి నేచర్ ను ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఉన్న సముద్రంతో పాటు నేచుర్ ను ఎంజాయ్ చేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సూర్య ఫ్యాన్స్ ఆనందపడి పోతున్నారు. స్పెషల్ వీడియోను కూడా జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో పాటు దానికి "స్వరంంలో మరో రోజు మనమిద్దరం" అని క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల్లో బిజీగా...
సూర్య అనేక సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సూర్యకు మంచి హిట్ దొరకలేదు. కంగువా, రెట్రో వంటివి పెద్దగా ఆడలేకపోయింది. దీంతో ఆయన కొత్త ప్రాజెక్టులను అంగీకరించే పనిలో సూర్య ఉన్నారు. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో పాటు ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో కరుప్పులో కూడా సూర్య నటిస్తున్నాడు. ఈ గ్యాప్ లో సూర్య,జ్యోతికల జంట వెకేషన్ ను ఎంజాయ్ చేయడానికి తూర్పు ఆఫ్రికా వెళ్లింది.