మే 20న ఓటీటీలో ఆచార్య

డిజాస్టర్ టాక్ తో నాలుగురోజులకే థియేటర్ల నుంచి అవుటైంది. సినిమా కోసం కోట్లు ఖర్చుచేసిన నిర్మాతలు..

Update: 2022-05-13 13:22 GMT

హైదరాబాద్ : హిట్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా.. డిజాస్టర్ టాక్ తో నాలుగురోజులకే థియేటర్ల నుంచి అవుటైంది. సినిమా కోసం కోట్లు ఖర్చుచేసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని, వారికి న్యాయం చేయాలని చిరంజీవికి పలు వినతులు కూడా వచ్చాయి. తాజాగా.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. డిజాస్టర్ గా నిలవడంతో.. 20 రోజులకే ఓటీటీలో విడుదలకానుంది ఆచార్య.

మే 20న అమెజాన్ ప్రైమ్ లో ఆచార్యను విడుదల చేయనున్నట్లు ప్రైమ్ వీడియో తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఆచార్య చిత్రం రూ.140 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా, రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. కాగా.. అదే రోజు జీ 5 లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది.




Tags:    

Similar News