ఆచార్య సినిమా సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతో తెలుసా ?

తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 'ఆచార్య'

Update: 2022-04-23 05:46 GMT

మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'ఆచార్య'. భారీ అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. ఆచార్య కు కొరటాల శివ రచన, దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామా చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కలిసి నిర్మించాయి. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ నటించారు. తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 'ఆచార్య' సినిమాకు 'యు/ఎ' స‌ర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 46 నిమిషాలుగా రన్ టైమ్‌ను లాక్ చేశారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌డంతో రిలీజ్ కోసం.. మెగా ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ అందించటంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి న‌క్స‌లైట్స్‌గా క‌నిపించ‌నున్నారు. టైటిల్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపిస్తే.. సిద్ధ అనే పాత్ర‌లో చ‌ర‌ణ్ మెరవనున్నాడు. ధ‌ర్మ స్థ‌లి అనే అమ్మ వారి అల‌యానికి సంబంధించిన క‌థాంశంతో సినిమాను తెర‌కెక్కించారు. శనివారం ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుంది.
యూసుఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ జ‌రుగ‌నుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారన్న దానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. సురేఖ కొణిదెల స‌మ‌ర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య చిత్రాన్ని నిర్మించారు. సోనూసూద్, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags:    

Similar News