బాయ్ కాట్ దుమారంలో కొట్టుకుపోయిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..!

హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్.. అధికారిక హిందీ రీమేక్ అయిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ కథానాయికగా నటించింది.

Update: 2022-10-06 01:52 GMT

బాలీవుడ్ లో ఇటీవలి కాలంలో బాయ్ కాట్ ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే..! ఎన్నో సినిమాలను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపును ఇచ్చారు. ఆ లిస్టులో బాలీవడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా ప్రముఖంగా ఉంది. సినిమా బాలీవుడ్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో షోలను వరుసగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్లిపోయారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా వచ్చిన ఆరు నెలల దాకా ఓటీటీలోకి విడుదల చేయనని చెప్పిన ఆమిర్ ఖాన్.. తన సినిమాను చాలా తొందరగా ఓటీటీలోకి తీసుకుని వచ్చారు.

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం తమ సోషల్ మీడియా పేజీలలో సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్.. అధికారిక హిందీ రీమేక్ అయిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ కథానాయికగా నటించింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లాల్ సింగ్ చద్దా కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉందని తెలిపింది. "Keep your p̶o̶p̶c̶o̶r̶n̶ golgappas ready because Laal Singh Chaddha is NOW STREAMING! #AamirKhan @kareenakapoorkhan @monajsingh @aamirkhanproductions @viacom18studios @paramountpics." అంటూ నెట్ ఫ్లిక్స్ ఇండియా పోస్టు పెట్టింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ఎంజాయ్ చేయనున్నారు.
లాల్ సింగ్ చద్దా థియేట్రికల్ రన్ అయిన ఆరు నెలల తర్వాత మాత్రమే ఏదైనా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అనుమతిస్తానని అమీర్ స్వయంగా ప్రకటించారు. షెడ్యూల్ కంటే ముందే సినిమాను OTTలో అందుబాటులోకి తీసుకుని రావడం.. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవ్వడమేనని అనుకుంటూ ఉన్నారు. లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. మోనా సింగ్ సహాయక పాత్రలో నటించింది. లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11, 2022న రక్షా బంధన్ సందర్భంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైంది.


Tags:    

Similar News