ప్రేమమ్ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ.. అప్పుడే వారికి సెలబ్రేషన్ మూడ్ వచ్చేసింది. ప్రేమమ్ చిత్రం ఆఫీషియల్ ఛానెల్ ను ఇప్పటికే 20 లక్షల మంది వీక్షించారట. ఇది ఒక అరుదైన జనాదరణగా సినిమా టీమ్ పండగ చేసుకుంటోంది.
మళయాళంలో సూపర్ హిట్ సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని నాగచైతన్య హీరోగా , చందు మొండేటి దర్శకత్వంలో తెలుగులో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మీద కుర్రకారులో చాలా అంచనాలే ఉన్నాయి. మళయాళంలో ప్రేమమ్ సాధించిన విజయం అలాంటిది. తెలుగులో చైతూ సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నది.
ఈ చిత్రం అఫీషియల్ ఛానెల్ కు 20 లక్షల వ్యూస్ వచ్చిన సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. ప్రేమకథలు ముగుస్తాయి.. కానీ అనుభూతులు కాదు.. అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ప్రేమమ్ తెలుగు యువతను ఎలా రంజింపజేస్తుందో మరి.