ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ.. టికెట్ రేట్ల వివాదం సంగతేంటి?

ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు మీడియాతో మాట్లాడారు. టికెట్ల రేట్లపై అన్ని అంశాలను చర్చించామని

Update: 2022-02-17 09:51 GMT

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొంతకాలంగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే ఏపీ ప్రభుత్వం ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ రోజు ఉదయం సచివాలయంలో భేటీ అయి, సినిమా టికెట్ల వివాదం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. ఈ వివాదానికి నేటితో చెక్ పడనుందని అందరూ భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు మీడియాతో మాట్లాడారు. టికెట్ల రేట్లపై అన్ని అంశాలను చర్చించామని, కమిటీ అడిగినవాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్ల ధరలు మూడు స్లాబుల్లో ఉండనున్నట్లు చెప్పారు. అతిత్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. కాగా.. ఇకపై థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ ఉంటుందని, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.




Tags:    

Similar News