Breaking : విజయ్ ఫ్యాన్స్ కు సంక్రాంతి వేళ గుడ్ న్యూస్

విజయ్ సినిమా జననాయగన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది

Update: 2026-01-09 05:25 GMT

విజయ్ సినిమా జననాయకన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విజయ్ నటించిన జననాయకన్ సినిమా నేడు విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీనిపై మద్రాస్ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎఫ్.సి.ని హైకోర్టు ఆదేశించింది.

జననాయకన్ సినిమాకు...
బీజేపీ ప్రభుత్వంపై ఈ సినిమాలో విమర్శలున్నందునే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయి. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పుతో జననాయకన్ సినిమా ను ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై మేకర్స్ నేడు, రేపటిలో తేదీని ప్రకటించే అవకాశముంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ కు సంక్రాంతి వేళ గుడ్ న్యూస్ లభించినట్లయింది.


Tags:    

Similar News