కరోనా పరీక్షలపై అలసత్వం.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

కరోనా పరీక్షలు చేయడంలో ఇంత అలసత్వం పనికిరాదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఎప్పటికప్పుడే కరోనా కొత్తవేరియంట్లు బయటపడుతున్న

Update: 2022-02-20 05:19 GMT

ప్రపంచం మొత్తాన్ని నిన్న మొన్నటి వరకూ హడలెత్తించింది కరోనా. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో.. ఆయా దేశాలు కరోనా నిర్థారణ పరీక్షలను కూడా తగ్గించేశాయి. కరోనా పరీక్షలను తగ్గించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు చేయడంలో ఇంత అలసత్వం పనికిరాదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఎప్పటికప్పుడే కరోనా కొత్తవేరియంట్లు బయటపడుతున్న నేపథ్యంలో.. పరీక్షలను క్రమం తప్పకుండా చేయడం కీలకమని, వాటిని తక్షణమే కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోన్ సూచించారు.

ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గినట్లు తాము గుర్తించినట్లు కెర్ఖోన్ తెలిపారు. ఒకరికి కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు, వైద్యం చేసేందుకు పరీక్షలు తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు. కరోనా ఆట ఒమిక్రాన్ వేరియంట్ తోనే ఆగిపోలేదని, మరిన్ని కొత్తవేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని మారియా ఇటీవలే చెప్పారు. మున్ముందు వచ్చే కొత్త వేరియంట్లను వైల్డ్ కార్ట్ ఎంట్రీగా అభివర్ణించారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ కనుక వెలుగు చూస్తే అది మరింత శక్తివంతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.




Tags:    

Similar News