Thu Mar 19 2026 07:43:35 GMT+0530 (India Standard Time)
జాతీయ రహదారిపై కాల్పుల కలకలం
జాతీయ రహదారిపై అర్థరాత్రి కాల్పుల కలకలం రేగింది. దారిదోపిడీకి ప్రయత్నించిన దొంగలు లారీపై కాల్పులకు పాల్పడ్డారు.

జాతీయ రహదారిపై అర్థరాత్రి కాల్పుల కలకలం రేగింది. దారిదోపిడీకి ప్రయత్నించిన దొంగలు లారీపై కాల్పులకు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడుతో వస్తున్న లారీపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డ్రైవర్ కు గాయాలయ్యాయి.
లారీని ఆపేందుకు......
నిన్న అర్థరాత్రి చేబ్రోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఐదుగురు దుండగులు దారి కాచారు. అటుగా వస్తున్న సిమెంట్ లోడు లారీని ఆపాల్సిందిగా కోరారు. డ్రైవర్ ఆపకపోవడంతో కాల్పులు జరిపారు. లారీ అద్దం నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

