పూప్ తీసుకెళ్లే సూట్ కేస్.. పుతిన్ తో పాటూ!!
ఇటీవల అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యారు.
ఇటీవల అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యారు. ఆ సమయంలో పుతిన్ మలవిసర్జన వ్యర్థాలను తీసుకెళ్లడానికి ఆయన బాడీగార్డులు ప్రత్యేకంగా ఓ సూట్‌కేసును తీసుకెళ్లారు. పుతిన్ ఆరోగ్యం గురించి విదేశీయులు తెలుసుకోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పుతిన్ ఎక్కడికైనా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన బాడీగార్డులు మలవిసర్జన వ్యర్థాలను సేకరించి రష్యాకు తిరిగి తీసుకెళ్తారు. అదే తరహాలో అలాస్కా భేటీకి ప్రత్యేక సూట్‌కేసును తీసుకొచ్చినట్లుగా తెలిపింది. మల పరీక్ష ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ జాగ్రత్తలు తీసుకుంటుంది రష్యా.