అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టించింది. పదిహేను కోట్ల మందికి పైగా ప్రజలు గడ్డ కట్టే చలిలో వణికిపోతున్నారు. మంచు తుఫాన్‌తో 1,800 విమానాలు రద్దయ్యాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే బయటకు రావాలని కూడా అధికారులు ప్రజలకు హెచ్చరికలుజారీ చే శారు.
పదిహేను రాష్ట్రాలకు ఎమెర్జెన్సీ...
మంచు తుపాను దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇటు విద్యుత్తు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతును్నారు. దీంతో అమెరికా ప్రభుత్వ అధికారులు పదిహేను రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.