మోదీపై ట్రంప్ ప్రశంసలు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దావోస్ లో పర్యటిస్తున్న డొనాల్డ్ ట్రంప్ భారత్ తో తమకు సత్సంబంధాలున్నాయని తెలిపారు. భారత్ ఎప్పటికీ అమెరికాకు మిత్రదేశమేనని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎంతో గౌరవం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ తో వాణిజ్య సంబంధాలు...
మోదీ తన స్నేహితుడని, అద్భుతమైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. భారత్ - అమెరికా సంబంధాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన అన్నారు. వాణిజ్య ఒప్పందాలపై కూడా త్వరలోనే తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.