ఆ విమానం ఎగిరింది.. ప్రపంచ దేశాల్లో టెన్షన్ మొదలైంది

అమెరికన్లు డూమ్స్ డే విమానంగా పిలిచే బోయింగ్‌ 747–200బీ విమానం లూసియానాలోని బోస్సియర్‌ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుంది.

Update: 2025-06-20 12:00 GMT

America

అమెరికన్లు డూమ్స్ డే విమానంగా పిలిచే బోయింగ్‌ 747–200బీ విమానం లూసియానాలోని బోస్సియర్‌ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుంది. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోయే అవకాశం ఉండడంతో ఈ విమానం గురించి చర్చించడం మొదలెట్టారు. అమెరికాలో యుద్ధంవస్తే ప్రళయకాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్‌డే ఎయిర్‌క్రాఫ్ట్‌ అనే పేరుంది. దీనిని ‘నైట్‌వాచ్‌’, ‘ఫ్లయింగ్‌ పెంటగాన్‌’ అని కూడా పిలుస్తారు. ఏకధాటిగా 12 గంటల పాటు నైట్‌వాచ్‌ గాల్లో ఉండి 7,000 మైళ్లు ప్రయాణించగలదు. రీఫ్యూయలింగ్‌ చేసుకొని వారం పాటు గగనతలంలోనే ఉండొచ్చు. ఇప్పటి వరకు అత్యధికంగా 35.4 గంటలు గాల్లో ఉంది.

Tags:    

Similar News