పడవ ప్రమాదం.. ఇరవై ఏడు మంది మృతి
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. లాంపెడూసా సమీపంలో జరిగిన విషాదం చోటు చేసుకుంది. రెండు పడవలు బోల్తాపడిన ఘటనలో ఇరవై ఏడు మంది మరణించారు.
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. లాంపెడూసా సమీపంలో జరిగిన విషాదం చోటు చేసుకుంది. రెండు పడవలు బోల్తాపడిన ఘటనలో ఇరవై ఏడు మంది మరణించారు. లిబియాలోని ట్రిపోలి నుంచి ఇటలీకి వెళుతున్న సోమాలియా, ఈజిప్ట్ కు చెందిన దాదాపు 97 మంది వలసదారులు రెండు పడవుల్లో బయలుదేరగా ప్రమాదం జరిగింది.
ఒకే పడవలోకి చేరడంతో...
అయితే ఒక పడవలోకి నీరు చేరడంతో మరొక పడవలోకి అందరూ చేరారు. దీంతో బరువు ఎక్కువ కావడంతో పడవ బోల్తా పడింది. దీంతో ఇరవై ఏడు మంది మరణించారు. 97 మందిలో వెంటనే 60 మందిని కాపాడగలిగారు. నీటిలో మునిగిన వారికి గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.