స్వీడన్ లో ఎంచక్కా.. చర్చిని తరలించారు
స్వీడన్ ప్రభుత్వం కిరునా నగరంలో 113 ఏళ్ల క్రితం కలపతో నిర్మించిన 'కిరునా కిర్కా' చర్చిని ఐదు కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తీసుకుని వెళ్ళింది.
స్వీడన్ ప్రభుత్వం కిరునా నగరంలో 113 ఏళ్ల క్రితం కలపతో నిర్మించిన 'కిరునా కిర్కా' చర్చిని ఐదు కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తీసుకుని వెళ్ళింది. నగరంలోని కొన్ని భవనాలతో పాటు ప్రజలకు సైతం పునరావాసం కల్పిస్తోంది. స్వీడన్ ప్రభుత్వ ఎల్‌కేఏబీ కంపెనీ కిరునా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తోంది. కిరునాలో గని తవ్వకాలు 1910లో మొదలు పెట్టిన ఎల్‌కేఏబీ కంపెనీ అక్కడి గుట్టపై 1912లో ఈ లూథరన్ చర్చిని పూర్తిగా కలపతో నిర్మించింది. స్వీడన్ వాసులకు ఇది ఎంతో ఇష్టమైన చర్చి. లోతులో చేపడుతున్న గని తవ్వకాలతో ఇప్పటికే నగరంలోని కొన్ని ఇళ్లు, నిర్మాణాలకు పగుళ్లు వచ్చాయి. అందుకే నగరాన్ని తరలించేందుకు 2004 నుంచే 30 ఏళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలోని 3వేల ఇళ్లతో పాటు 6 వేల మందికి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పునరావాసం కల్పించింది.