వణికిస్తోన్న యూనిస్ తుఫాన్.. భీకర గాలులకు ఎగిరిపోతున్న జనం

వారం వ్యవధిలో వచ్చిన రెండో తుఫాను కావడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. వాయువ్య ఐరోపాలో గంటకు 122 మైళ్ల వేగంతో వీచిన..

Update: 2022-02-19 07:00 GMT

యూనిస్ తుఫాన్ బ్రిటన్ ను చిగురుటాకులా వణికిస్తోంది. వారం వ్యవధిలో వచ్చిన రెండో తుఫాను కావడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. వాయువ్య ఐరోపాలో గంటకు 122 మైళ్ల వేగంతో వీచిన గాలుల ధాటికి అక్కడి ప్రజల జీవితాలు తారుమారయ్యాయి. తుఫాన్ కారణంగా 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను జెట్ స్ట్రీమ్ ద్వారా అజోర్స్ నుండి యూరప్ వైపు దూసుకెళ్లి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ కార్యాలయం తెలిపింది.

యూనిస్ తుఫాను కారణంగా 436 విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. తుఫాను తీవ్రమవుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సముద్ర తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రజలు ఎంతటి అత్యవసర ప్రయాణాలైనా.. వాయిదా వేసుకుని ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. భీకర గాలులకు చాలావరకూ ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన ప్రజలకు గాలుల ధాటికి నిలబడలేకపోయారు.


Tags:    

Similar News