షాకింగ్.. వీసా ఫీజులు పెంచిన అమెరికా
అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది.
అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది. వీసా ఫీజులను భారీగా పెంచేసింది ట్రంప్ సర్కార్. అమెరికా గడ్డపై అడుగుపెట్టాలనుకునేవారి నుంచి ‘ఇంటెగ్రిటీ ఫీ’ కింద అదనంగా 250 డాలర్లను వసూలు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే ఆమోదించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ కింద ఈ పెంపు వచ్చే ఏడాది నుంచి అమలు కానుంది.
హెచ్-1బీ, విద్యార్థి వీసా, పర్యాటక/వ్యాపార వీసా, ఎక్స్చేంజ్ వీసాలపై అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికాకు పర్యాటక లేదా వ్యాపార వీసాపై వెళ్లాలంటే అందుకు వీసా చార్జీల కింద 185 డాలర్లు వసూలు చేస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్‌లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను, ఇంటెగ్రిటీ రుసుమును కూడా కలుపుకొంటే అది ఏకంగా 472 డాలర్లకు చేరుతుంది. అయితే వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న టైమ్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ఈ ఫీజు రీఫండ్ చేసే అవకాశం ఉంది.