బ్రిటన్ నౌకా దళంలో తొలి హిందూ పూజారి.. ఏమి చేస్తారంటే?
బ్రిటన్ రాయల్ నేవీలో తొలిసారిగా హిందూ పూజారి నియమితులయ్యారు.
బ్రిటన్ రాయల్ నేవీలో తొలిసారిగా హిందూ పూజారి నియమితులయ్యారు. నేవీ అధికారులకు హిందూ ఆధ్యాత్మిక విషయాలను బోధించడానికి బ్రిటన్‌లో నివసిస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన భాను అత్రీకి ఈ అవకాశం లభించింది. రాయల్ నేవీలోని తొలి క్రైస్తవేతర పూజారిగా భాను అత్రీ చరిత్ర సృష్టించారు. ఈ పదవిలో నియమించే ముందు ఆయనకు కఠినమైన మిలటరీ శిక్షణ ఇచ్చారు. యుద్ధనౌక హెచ్‌ఎంఎస్ ఐరన్ డ్యూక్‌లో మూడు వారాల పాటు సముద్రంలో శిక్షణ పొందారు.