లాస్ ఏంజెల్స్ లో కొనసాగుతున్న ఆందోళనలు

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Update: 2025-06-10 03:47 GMT

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్రమ వలసదారుల అరెస్టుతో హింస చెలరేగింది. గత కొన్ని రోజుల నుంచి హింసాత్మకఘటనలు జరగడంతో పోలీసులు, భద్రతాదళాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను తరిమికొట్టేందుకు ప్రయత్నించాయి. అక్రమ వలసదారులను అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళనకారులు పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులపై బాష్పవాయువు,రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం చేశారు.

నేషనల్ గార్డులను...
పదుల సంఖ్యలో ఆందోళనకారుల అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ నిరసనలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ వలసదారులను అరెస్ట్ ను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను అణిచి వేయడానికి డొనాల్డ్ ట్రంప్ దాదాపు రెండు వేల మంది నేషనల్ గార్డులను నియమించారు. ఆస్తులు ధ్వంసం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే ఆందోళన కారుల నిరసనలు మాత్రం లాస్ ఏంజెల్స్ లో కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News