ఎట్టకేలకు అంగీకరించిన పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ తో తమ దేశానికి నష్టం వాటిల్లిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు

Update: 2025-05-17 03:53 GMT

ఆపరేషన్ సిందూర్ తో తమ దేశానికి నష్టం వాటిల్లిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పహాల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ తమ దేశంపైకి క్షిపణులతో దాడికి దిగిందని చెప్పారు. తమ దేశ వైమానిక దళ వ్యవస్థను కొంత నష్టం చేకూర్చిందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

దాడులు జరిగిన విషయాన్ని...
మే 9, 10 తేదీల్లో ఈ దాడులు జరిగాయని ఆయన చెప్పారు. దాడులు జరిగిన తర్వాత ఈ విషాయన్ని ఆర్మీ చీఫ్ జనరల్ తనకు ఫోన్ చేసి చెప్పారన్న షెహబాజ్ షరీఫ్ రావిల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర స్థావరాలపై కూడా దాడి జరిగిందన్నారు. తమ సైన్యం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని కూడా చెప్పారు.



Tags:    

Similar News