విదేశాల నుంచి కొనాల్సిందే

సౌదీ అరేబియా.. చుట్టూ ఇసకే.. 95 శాతం ఎడారే. అయినా కూడా ఈ దేశం ఇసుక కొంటూ ఉంది.

Update: 2025-07-25 09:45 GMT

సౌదీ అరేబియా.. చుట్టూ ఇసకే.. 95 శాతం ఎడారే. అయినా కూడా ఈ దేశం ఇసుక కొంటూ ఉంది. ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా లభించే ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడకపోవడమే ముఖ్య కారణం. సౌదీ అరేబియా భారీ కట్టడాలను నిర్మిస్తోంది. వీటికి అవసరమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఎడారి ఇసుక చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా నిరంతరం వీచే గాలుల వల్ల కోతకు గురై.. ఇసుక రేణువులు గుండ్రంగా మారిపోతాయి. ఇలాంటి ఇసుకను సిమెంట్‌తో కలిపినా గట్టితనం రాదు. అందుకే సౌదీ అరేబియాలో దొరికే ఇసుకను నిర్మాణాల్లో వాడడం లేదు. సౌదీ అరేబియా మాత్రమే ఇసుకను దిగుమతి చేసుకోవడం లేదని, ఆ జాబితాలో యునైటెడ్‌ ఎమిరేట్స్‌, ఖతార్‌ దేశాలు కూడా ఉన్నాయి. దుబాయ్‌, అబుదాబి లాంటి నగరాల్లో నిర్మాణాలకు భారీ మొత్తంలో ఇసుక కొరత ఏర్పడింది. భవనాలు బలంగా, ఎక్కువకాలం ఉండాలన్న ఉద్దేశంతో నాణ్యమైన ఇసుకను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

Tags:    

Similar News