నేడు హసీనాకు ఉరిశిక్ష పడనుందా?

బంగ్లాదేశ్ లో నేడు మాజీ ప్రధాని షేక్ హసీనాపై కీలక తీర్పు వెలువరించనుంది.

Update: 2025-11-17 04:34 GMT

బంగ్లాదేశ్ లో నేడు మాజీ ప్రధాని షేక్ హసీనాపై కీలక తీర్పు వెలువరించనుంది. హసీనాకు ఉరి శిక్ష పడే అవకాశముందని ఆమె కుమారుడు వాజిద్ చెబుతన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన కేసులో నేడు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ నేడు తీర్పు వెలువరించనుంది. అయితే ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. 2024లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసలో నేడు తీర్పు వెలువడనుంది.

బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత...
దీంతో షేక్ హసీనా నిన్న రాత్రి ఫేస్ బుక్ వేదికగా ప్రసంగం చేశారు. తాను బతికే ఉంటానని, భయపడబోనని, దేశ ప్రజలకు మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నారు. హసీనాకు మరణశిక్ష విధిస్తారన్న వార్తలతో ఆమె మద్దతు దారులు నేడు దేశ వ్యాప్త బంద్ కు పిలుపు నిచ్చారు. రహదారులపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వం పెద్దయెత్తున సైనికులను మొహరించింది. దీంతో బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి


Tags:    

Similar News