Pak vs India :భారత్ పిచ్చికానీ ఆ డిమాండ్ కు పాక్ తలొగ్గుతుందా?

భారత్ ఆశించినట్లుగా ఉగ్రవాదులను అప్పజెప్పేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంటుందని భావించలేం

Update: 2025-05-29 01:49 GMT

పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం లేదు. ఒకరకంగా అక్కడ ప్రభుత్వం లేదు. సైన్యం అక్కడ కథ నడిపిస్తుంది. ప్రభుత్వాన్ని పరోక్షంగా శాసించేది... ప్రజలను పాలించేది సైన్యమే. అంతటితో ఆగలేదు. ఉగ్రవాదులు కూడా పాక్ ఎలా నడుచుకోవాలో చెబుతారు. వారికి అవసరమైన నిధులు, ఆయుధ సంపత్తిని కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ లోని ప్రభుత్వం ఉత్సవ విగ్రహమే. కాల్పుల విరమణ కూడా పాక్ సైన్యం నుంచి వచ్చిన ప్రతిపాదనే. తాము పూర్తిగా భారత్ చేతిలో నష్టపోక ముందే గౌరవంగా తప్పుకోవడం మంచిదన్న భావన సైన్యంలో కలిగింది. అందుకే కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరమీదకు తీసుకు వచ్చింది.

భారత్ అందుకే...
తాను కేవలం ప్రతిపాదన చేస్తే భారత్ అంగీకరించకపోవచ్చని, అలాగని భారత్ పై దాడులకు దిగకపోతే పాక్ లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందని భావించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అభ్యర్థించడంతో ఆయన ముందుకు వచ్చారు. అయితే భారత్ కూడా పాక్ తో కయ్యం కంటే ప్రధాన మైనది ఉగ్రవాదులను మట్టుబెట్టడమే ప్రధాన ఉద్దేశ్యం కావడంతో కాల్పుల విరమణకు భారత్ కూడా అంగీకరించింది. అయితే రెండు దేశాలకు చెందిన డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. అయితే చర్చల్లో పాక్ ప్రధానంగా సింధూ జలలాలను విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ పెట్టింది. దీనికి భారత్ మాత్రం ఉగ్రవాదులను తమకు అప్పగించాలని కోరింది.
ఆ శక్తి ఉందా?
కానీ ఉగ్రవాదులను భారత్ కు పాకిస్తాన్ అప్పగించే శక్తి ఉంటుందని ఎవరైనా అనుకుంటే అంత కంటే హాస్యాస్పదం మరొకటి ఉండదన్న అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతుంది. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు పాకిస్తాన్ వ్యవహరిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులకు ఊతమిస్తుందే పాకిస్తాన్. ఆ విషయం ప్రపంచదేశాలన్నింటికీ తెలుసు. వాటికి దెబ్బతగిలినప్పడే అమ్మా అనడం తప్పించి తర్వాత పాక్ పై వల్లమాలిన ప్రేమ చూపే అనేక దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ముందుకు రావు. భారత ఎంపీలను ఎంపికచేసి మరీ కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని దేశాలకు పంపి పాక్ పన్నాగాలను చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం ఉంటుందన్నది అనేక మంది ప్రశ్న. పహాల్గామ్ లో అమాయకులను కాల్పి చంపిన ఉగ్రవాదులను హతమార్చేంత వరకూ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని పాలకులు చెబుతున్నా అది ఆచరణలో సాధ్యాసాధ్యాలు కొంత అనుమానంగానే కనిపిస్తున్నాయి. పాక్ వైఖరే అంత. ఉగ్రవాదులను అప్పగింతకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదు. మరి భారత్ చర్చల్లో ఏంచేస్తుంది? ఎలా ముందుకు వెళుతుంది?


Tags:    

Similar News