బంగ్లాదేశ్ లో భారత వీసా సేవలు ప్రారంభం
బంగ్లాదేశ్ లో భారతీయ వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి
బంగ్లాదేశ్ లో భారతీయ వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల గత కొద్ది రోజుల నుంచి బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో వీసా కేంద్రాలను బంగ్లాదేశ్ లో భారత ప్రభుత్వం మూసివేసింది. రాయబార కార్యాలయాల వద్ద నిరసనలు జరగడంతో వాటిని కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంన్న సంగతి తెలిసిందే.
తాత్కాలికంగా మూసివేసిన...
అయితే తాత్కాలికంగా నిలిపివేసిన భారతీయ కేంద్రాల్లో తిరిగి వీసా సేవలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే చిట్టాగాంగ్ తప్ప మిగిలిన ప్రాంతాలన్నింటిలో వీసా కేంద్రాలను తెరుస్తున్నట్లు, కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.