విదేశాలకు వెళ్లే ఎంపీ బృందాలకు తేదీల ఖరారు
విదేశాలకు వెళ్లే ఎంపీ బృందాలకు తేదీలను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
విదేశాలకు వెళ్లే ఎంపీ బృందాలకు తేదీలను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరిని వివరించేందుకు అన్ని పక్షాలతో కూడిన ప్రజాప్రతినిధుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపనుంది. ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలకు భారత ఎంపీలు వివరించనున్నారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలు, యూఏఈ వెళ్లనున్న శ్రీకాంత్ షిండే బృందం పంపనుంది.
ఆపరేషన్ సిందూర్ పై...
ఈ నెల 21 నుంచి జూన్ 3 వరకు శ్రీకాంత్ శిందే బృందం పర్యటించనుంది. ఈ నెల 21న జపాన్‌కు సంజయ్ ఝా నేతృత్వంలోని ఎంపీల బృందం, ఈ నెల 24న గయానాకు శశి థరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందం, ఈ నెల 22న రష్యా వెళ్లనున్న కనిమొళి నేతృత్వంలోని ఎంపీల బృందం, ఈ నెల 24న దోహా, ఖతార్‌కు సుప్రియా సూలే నేతృత్వంలోని ఎంపీల బృందం, ఆయా బృందాల పర్యటనపై ఈ నెల 21, 23న వివరించనున్న విక్రం మిస్రీ బృందం పర్యటించి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించనుంది.