Bangladesh : బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న దాడులు.. క్రికెట్ పై కూడా ప్రభావం
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో హిందువుల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరొక హిందు వ్యాపారవేత్తహత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లా కపాలియా బజార్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం హిందూ వ్యాపారవేత్త, పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడైన రాణా ప్రతాప్ బైరాగి ని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం… ఖుల్నా డివిజన్‌లోని జెస్సోర్ జిల్లా కేశబ్‌పూర్ ఉపజిల్లా అరువా గ్రామానికి చెందిన బైరాగి కపాలియా బజార్‌లో ఐస్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నరైల్ నుంచి వెలువడే ‘దైనిక్ బీడీ ఖబర్’ పత్రికకు కార్యనిర్వాహక సంపాదకుడిగా కూడా పనిచేస్తున్నారు.
ఘటన స్థలిలో మరణించడంతో...
సోమవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనను ఐస్ ఫ్యాక్టరీ నుంచి పిలిపించి, కపాలియా క్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ ఎదుట ఉన్న గల్లీలోకి తీసుకెళ్లారు. అక్కడ దగ్గర నుంచి తలపై కాల్పులు జరిపి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. మోనిరాంపూర్ బైరాగి తలపై మూడు తూటాలు తగలడంతో పాటు గొంతు కోసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రతాప్ బైరాగి హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. మృతుడిపై రెండు పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే వాటి వివరాలను వెల్లడించలేదు.
ప్రపంచ కప్ పై....
ఇప్పటికే బంగ్లాదేశ్ - ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ వేలంలో 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ బంగ్లాదేశ్ లో తలెత్తిన రాజకీయ పరిస్థితుల కారణంగా అతనిని జట్టు నుంచి రిలరీజ్ చేసింది. మరొకవైపు టీ20 ప్రపంచ కప్ లో భారత్ లో జరిగితే బంగ్లాదేశ్ ఆడబోదని, భారత్ తో జరిగే మ్యాచ్ ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే తక్కువ సమయం ఉన్నందున ఆటగాళ్లు ప్రయాణం కష్టమవుతుందని కుదరదని చెప్పింది. అయితే తాము భారత్ లో ఆడబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేయడంతో ఇప్పుడు ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.