హసీనాను మాకు అప్పగించండి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను కోరింది
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను కోరింది. హసీనాకు ఉరిశిక్ష విధించడంతో తమకు అప్పగించాలని భారత్ ను బంగ్లాదేశ్ కోరింది. 2024 అల్లర్ల కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2024 ఆగస్టు నెలలో జరిగిన అల్లర్లలో దాదాపు పథ్నాలుగు వందల మంది మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ ను కోరిన బంగ్లాదేశ్
షేక్ హసీనా ఏడాది కాలం నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఆందోళనకారులను చంపేయాలని సైన్యాన్ని షేక్ ఆదేశించారన్న ఆధారాలున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో మరణశిక్షను అమలు చేసేందుకు షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ తీర్పు ఉందని షేక్ హసీనా పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని షేక్ హసీనా పేర్కొన్నారు. తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన న్యాయపరమైన అవకాశాలను కూడా కోర్టు కల్పించలేదన్నారు హసీనా.