లాహోర్ ను విడిచి వెళ్లండి.. తమ పౌరులకు అమెరికా సూచన
లాహోర్‌లో ఉన్న తమ పౌరులకు అమెరికా భద్రత సంస్థ హెచ్చరిక జారీ చేసింది
లాహోర్‌లో ఉన్న తమ పౌరులకు అమెరికా భద్రత సంస్థ హెచ్చరిక జారీ చేసింది. తమ దేశానికి చెందిన పౌరులు వెంటనే నగరం విడిచి వెళ్లిపోవాలని లేదా అక్కడే సురక్షిత ఆశ్రయం పొందాలని అమెరికా కోరింది. లాహోర్ లోని గగనతల రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేయడంతో అమెరికా అప్రమత్తమయింది. తమ దేశానికి చెందిన పౌరులు సురక్షితంగా ఉండాలని భావించి ఈ మేరకు ప్రకటన చేసింది.
సురక్షిత ప్రాంతాలకు...
పాకిస్తాన్ లోని అమెరికా దౌత్య కార్యాలయం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. డ్రోన్లు వచ్చి పడుతుండటంతో లాహోర్ లోని అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరింది. ఇప్పటికే అమెరికా దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే భారత్ లోని జమ్మూకాశ్మీర్ తో పాటు పాక్ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అమెరికా తమ దేశ పౌరులకు అమెరికా జారీ చేసింది.