జాతీయ రహదారిపై స్థంభించిన ట్రాఫిక్
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి.
దసరా సెలవులు ముగియడంతో ఈరోజు ఉదయం నుంచి జాతీయ రహదారులపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నిన్నటి నుంచి వాహనాల రద్దీ పెరిగింది. ఈరోజు విధులకు హాజరు కావాల్సి ఉండటంతో తమ సొంతూళ్ల నుంచి బయలుదేరిన ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.
దసరా సెలవులు ముగియడంతో ....
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సర్వీస్ రోడ్లపై కూడా వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు అవుటర్ రింగ్ రోడ్డు నుంచి నగరంలోకి చేరుకుంటుండగా, మరికొన్ని మాత్రం హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది.