Hyderabad : హైదరాబాద్ లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఖైరతాబాద్ లో గణేశ్ విగ్రహం నెలకొల్పడంతో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
హైదరాబాద్ లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఖైరతాబాద్ లో గణేశ్ విగ్రహం నెలకొల్పడంతో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముండటంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు...
రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని పోలీసులు తెలిపారు. ప్రధానంగా ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారీ భవన్, ఓల్ట్ పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్సెట్ రోటరీ వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పదిరోజుల పాటు వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.