Hyderabad : హైదరాబాద్ లో నేడు ఈ రూట్లో వెళ్లకండి

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి

Update: 2025-12-13 06:12 GMT

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ వస్తుండటంతో ఆయన ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఇక రాత్రికి ఉప్పల్ స్టేడియంలో ఏడు గంటలకు ఛారిటీ మ్యాచ్ ఆడనుండటంతో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు...
ఈ మేరకు రాచకొండ పోలీసులు ఆ సమయంలో బయటకు వచ్చేవారు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మెస్సీతో ఫొటో దిగేందుకు అరవై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మెస్సీతో ఫొటో దిగేందుకు పది లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసిన మొత్తాన్ని హైదరాబాద్ ఫుట్ బాల్ అభివృద్ధి కోసం వినియోగిస్తామని గోట్ హైదరాబాద్ సమన్వయ కర్త పార్వతీ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News