సైబర్ గేట్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు

మాధాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఐకియా నుంచి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ పెరిగింది.

Update: 2026-01-12 15:30 GMT

హైదరాబాద్: మాధాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఐకియా నుంచి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ పెరిగింది.

ఐదు రోజులపాటు మార్గమార్పు

రోడ్డు మరమ్మతులు చేపట్టిన నేపథ్యంలో సంబంధిత శాఖలు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేశాయి. ఐకియా నుంచి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే ప్రయాణికులు వచ్చే ఐదు రోజులపాటు సూచించిన మళ్లింపు మార్గాలు లేదా ప్రత్యామ్నాయ దారులు ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

మళ్లింపు వివరాలు

ఐకియా వైపు నుంచి వచ్చే వాహనాలను లెమన్ ట్రీ హోటల్ / రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద టెక్ మహీంద్ర–సీఐఐ జంక్షన్ వైపు మళ్లిస్తారు. అక్కడి నుంచి సైబర్ టవర్స్‌కు వెళ్లి, అనంతరం సాధారణ మార్గంలో జేఎన్‌టీయూ వైపు కొనసాగించాల్సి ఉంటుంది.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అధికారులు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఇచ్చే సూచనలు పాటించాలని వాహనదారులను కోరారు.

Tags:    

Similar News