విజయవాడ హైవైపై నేడు కూడా రద్దీ

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతుంది

Update: 2026-01-13 04:55 GMT

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలునెలకొన్నాయి. టోల్‌ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్థంభించింది. సంక్రాంతికి సొంతూళ్లకు పట్నం వాసులు పయనమయ్యారు. భోగి, సంక్రాంతి, కనుమ రోజున ఏపీలో కోళ్ల పందాలు జరుగుతుండటంతో ప్రజలు ఊళ్లకు బయలుదేరి వెళ్లనున్నారు. సంక్రాంతి పండుగతో పాటు కోళ్ల పందాలను ప్రజలు తిలకించనున్నారు.

వందలాది వాహనాలు...
ఏపీకి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనం క్యూ కడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ఏడాది రికార్డ్‌లో స్థాయిలో ప్రజలు తరలివెళ్లారు. నాలుగు రోజుల వ్యవధిలో ఏపీకి భారీగా లక్షల సంఖ్యలో వాహనాలు వెళ్లాయి. పలు టోల్‌ఫ్లాజాల దగ్గర అధిక సంఖ్యలో కార్లు బారులుతీరాయి. నగరాల నుంచి ప్రజల పల్లెబాటతో రహదారులు రద్దీగా మారాయి.


Tags:    

Similar News