IBomma : నేటి నుంచి పోలీస్ కస్టడీకి ఐ బొమ్మ రవి
నేటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారించనున్నారు.
నేటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. చంచల్ గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. గతంలో ఐదు రోజుల పాటు కస్టడీకి ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని సీసీఎస్ పోలీసులు విచారించారు.
ఇటీవల ఐదు రోజులు...
అయితే ఐదురోజుల పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి తమకు సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. యూజర్ ఐడీ, పాస్ వార్డ్ లు తనకు గుర్తు లేదని, మర్చిపోయానని చెబుతూ ఐదు రోజుల పాటు పోలీసుల విచారణలో కాలం గడిపేశారు. దీంతో మరోసారి తమకు కస్టడీకి ఇవ్వాలని కోరగా న్యాయస్థానం మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది.