పాధరక్షల వారసత్వాన్నికాపడుకొవాలి - జాతీయ సదస్సులో గవర్నర్ జిష్నుదేవ వర్మ
ఘనమైన భారతీయ పాధరక్షల వారసత్వాన్ని కాపాడి, కళాకారులకు చేయూత నివ్వాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అన్నారు.
గచ్చిబౌలి, నవంబర్, 28: ఘనమైన భారతీయ పాధరక్షల వారసత్వాన్ని కాపాడి, కళాకారులకు చేయూత నివ్వాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అన్నారు. ఫ్లీచ్ ఇండీయ ఫౌండేషన్, ఫూట్వేర్ డిసైన్ & డెవెలప్మెంట్ ఇన్స్టిటూట్ (ఎఫ్.డి.డి.ఐ) కలిసి, గచ్చిబౌలి లో నిర్వహిస్తున్న ‘టేల్స్ బిలో ది హీల్స్ - భారతీయ పాధరక్షల వారసత్వం’ రెండు రోజుల జాతీయ సధస్సును, శుక్రవారం నాడు ప్రారంభించారు, చారిత్రక పాధరక్షల వారసత్వ ఫొటొ ప్రదర్సనని తలపించిన చేసిన తరువాత ముఖ్య అతిధి ప్రసంగంలో, ‘మనం ఆలయ గోడలపై శిల్పాలనే కాదు ఆ శిల్పాల పాదాలను, పాధరక్షల చూడాలి, తరతరాలుగ రూపుదిద్దుకున్న వివిధ డెసైన్లను చూడాలి, ఆ పాదరక్షలోని ఛాయాచిత్రాలు అలనాటి పాదరక్షల వైభవాన్ని చాటి చెబుతున్నాయని అన్నారు. ఈ సదస్సు ఈ దిశగా చేపట్టబోయి పరిశోధనలకు మార్గదర్శకావాలని చెబుతూ నిర్వహకులను అభినందించారు. పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్, ఎఫ్డీడీఐ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డా. నరసింహుగారి తేజ్ లోహిత్ రెడ్డి, కీలక ఉపన్యాస కారుడు ఆచార్య రాఘవేంద్ర కులకర్ణి, కేంద్ర పురావస్తు శాఖ అధికారి నిఖిల్ దాస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.
ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, చైర్ పర్సన్ డా. తేజస్విని యార్లగడ్డ ఘనమైన వారసత్వమున్న పాదరక్షలపై నిర్వహిస్తున్న సదస్సు ఉద్దేశాలను వివరించగా, ఎఫ్డీడీఐ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డా. నరసింహుగారి తేజ్ లోహిత్ రెడ్డి సదస్సు, ప్రదర్శనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రతినిధులు, పరిశోధకులు, ఏడు రకాల పాదరక్షకుల కళాకారుల డెమో సందర్శకులను ఆకట్టుకుంది. ఎఫ్డీడీఐ, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిబ్బంది వారసత్వ ప్రేమికులు హాజరైనారు.