హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి
హైదరాబాద్ లో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు కంట్రోల్ ఎస్ సంస్థ శ్రీధర్ పిన్నపు రెడ్డి తెలిపారు
హైదరాబాద్ నగరంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు కంట్రోల్ ఎస్ సంస్థ శ్రీధర్ పిన్నపు రెడ్డి తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్ ఐటీ కంపెనీల అవసరాలకు తగినట్లు మొత్తం నలభై ఎకరాల్లో ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీకి కేంద్రంగా మారింది.
డేటా సెంటర్...
ఈ సమయంలో ఇక్కడ డేటా సెంటర్ అవసరాన్ని గుర్తించిన కంట్రోల్ ఎస్ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ డేటా సెంటర్ పూర్తి సామర్థ్యం 600 మెగా వాట్లుగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 52 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే హైదరాబాద్ లో ఉందని, తమ సంస్థ ఏర్పాటు చేసే దానితో ఐటీ రంగానికి మరింత అనుకూలంగా మారుతుందని ఆయన తెలిపారు.