మొయినా బాద్ డ్రగ్స్ కేసులో మరో మలుపు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

Update: 2026-03-26 07:30 GMT

మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా జూబ్లీహిల్స్ కు చెందిన ప్రముఖ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ అరెస్టుతో డ్రగ్స్ నెట్వర్క్ ఉన్న మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం...రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్ ను డ్రగ్స్ పార్టీల కోసం ఒక 'డెన్'గా వినియోగించినట్లు సిట్ గుర్తించింది. గతంలో పట్టుబడిన రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిలను విచారించిన సమయంలో డాక్టర్ పేరు బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ నుంచి డాక్టర్ కి ఎండీఎంఏ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ అందినట్లు ఆధారాలు లభించాయి.

ముగ్గురి కోసం వెదుకులాట...
ఈ కేసులో లోతైన విచారణ జరుగుతున్న కొద్దీ నిందితుల జాబితా పెరుగుతోంది. ఇప్పటివరకు 11 మందిగా ఉన్న నిందితుల సంఖ్య, తాజా అరెస్టులతో 15కు చేరింది. పెడ్లర్ రాకేష్ వర్మ, అభిషేక్, డాక్టర్ తో పాటు మరో వ్యక్తిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు.ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. డాక్టర్ కి డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా, అతను ఈ పార్టీల నిర్వహణలో ఏవైనా ఇతర బాధ్యతలు చేపట్టాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.










Tags:    

Similar News