Hyderabad : హైదరాబాద్ లో వాన

హైదరాబాద్ లో వర్షం కురిసింది

Update: 2026-03-25 12:19 GMT

హైదరాబాద్ లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. సాయంత్రం వేళ హైదరాబాద్ లో వానలు పడుతున్నాయి. ఎండాకాలంలో చిరుజల్లులతో నగర వాసులు సేదతీరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు వార్తలు వస్తున్నాయి. వనస్థలిపురం, ఎల్.బి.నగర్, హయత్ నగర్, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

నగరవాసులకు ఉపశమనమే అయినా...
భానుడు నిప్పులు కురుస్తున్న వేళ చిరుజల్లులు నగర వాసులకు ఉపశమనం కలిగించాయి. నిన్న సాయంత్రం కూడా వాన కురిసింది. ఈరోజు కూడా వాన పడటంతో కొంత చల్లదనం నగరంలో ఏర్పడింది. మరొకవైపు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ తేలిక పాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడ్డాయి.


Tags:    

Similar News