సంక్రాంతికి ఏపీకి వెళ్లిన వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది

Update: 2025-01-18 02:14 GMT

సంక్రాంతి పండుగ వేడుకలు ముగియడంతో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యా రు. సంక్రాంతి పండగకు లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. వారు తిరుగు ప్రయాణం అవ్వడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణం సుఖంగా, సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో ఉండటంతో ఎక్కువ మంది రైళ్లలోనే సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తారు. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లే వారు అందరూ రైళ్లలో ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండగ నిమిత్తం ఏపీకి వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసింది.

నేటి నుంచి విశాఖ నుంచి చర్లపల్లి కి ప్రత్యేక రైళ్లు ...
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు 18, 19 తేదీల్లో విశాఖపట్టణం నుంచి చర్లపల్లి వరకు నడవనున్నట్లు పేర్కొంది.విశాఖ -చర్లపల్లి -భువనే శ్వర్ రైలు.. 18వ తేదీన రాత్రి 7.45 గంటలకు విశాఖలో బయలుదేరు తుంది. 19వ తేదీ ఉదయం 7గంటలకు చర్లపల్లికి చేరుతుంది.19వ తేదీ ఉదయం 9గంటలకు చర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 7.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 7.50 గంటలకు బయలు దేరి 20వ తేదీ తెల్లవారు జామున 2.15 గంటలకు భవనేశ్వర్ చేరుతుంది. విశాఖ – చర్లపల్లి – విశాఖ రైలు .. 18వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరు తుంది. 19వ తేదీ ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 19వ తేదీ ఉధయం 10గంటలకు చర్లపల్లిలో బయలుదేరి రాత్రి 10గంటలకు విశాఖకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News