సంక్రాంతి పండగ తిరుగు ప్రయాణాలు ప్రారంభం

సంక్రాంతి పండగ తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి

Update: 2026-01-17 03:21 GMT

సంక్రాంతి పండగ తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారిపై నేడు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి వెళ్లేవారితోవిజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. హైదరాబాద్ వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సుల్లో సీట్లు నిండిపోయాయి. రద్దీ వల్ల పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సలు ఆర్టీసీ నడుపుతోంది.

జాతీయ రహదారిపై...
రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఇక హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాహనాల రద్దీ కొంత ఎక్కువగా ఉంది. రేపు ఆదివారమయినా అందరూ ఒక్కసారిగా బయలుదేరితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని శనివారమే హైదరాబాద్ కు చాలా మంది చేరుకుంటున్నారు. జాతీయ రహదారిపై పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు మార్గాల్లో దారిని మళ్లించారు.


Tags:    

Similar News