Hyderabad : హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయం.. ఈ నెల 12న ప్రారంభం

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది

Update: 2026-03-07 07:30 GMT

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రముఖ ఓటీటీసీ సంస్థ వీఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ ను నెట్ ఫ్లిక్స్ స్టూడియోస్ హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఈ సంస్థను ముప్ఫయి వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ప్రారంభించనున్నారు.

ముప్ఫయి వేల చదరపు అడుగుల్లో...
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వినోదాన్ని అందించే నెట్ ఫ్లిక్స్ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు కావడం శుభపరిణామని అంటున్నారు. భారత్ లోకి నెట్ ఫ్లిక్స్ అడుగు పెట్టి పదేళ్లవుతున్న సందర్భంగా విస్తరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో యానిమేషన్, గేమింగ్, అండ్ కామిక్స్, విజువల్ ఎఫెక్ట్ రంగంలో హైదరాబాద్ మరింతగా రాణిస్తుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ పెట్టుబడులు పెట్టడం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెబుుతన్నారు.


Tags:    

Similar News