Hyderabad : సోమాజిగూడలో అగ్ని ప్రమాదం

హైదరబాబాద్ లోని సోమాజిగూడ వైన్‌షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది

Update: 2026-03-07 03:50 GMT

హైదరబాబాద్ లోని సోమాజిగూడ వైన్‌షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్‌భవన్‌ రోడ్డులో తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని ప్రాథమికంటా అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

షార్ట్ సర్క్యూట్ కారణమని...
సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ రోడ్డులో ఉన్న ఓ వైన్‌షాప్‌లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సిబ్బంది తక్షణ చర్యలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News