Telangana : నేడు రేవంత్ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 124 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. దేవ్ జీ దళానికి చెందిన పీఎల్జీఏ సభ్యులు భారీ సంఖ్యలో లొంగిపోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.
భారీ సంఖ్యలో మావోయిస్టులు...
ఈ సమావేశానికి ముందు మావోయిస్టుల లొంగుబాటు ఉంటుంది. అలాగే భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందులో కీలక నేతలు ఎవరున్నారు? ఎన్ని ఆయుధాలు సరెండర్ చేయనున్నారన్నది సాయంత్రం నాలుగు గంటలకు తెలియనుంది. ఇప్పటికే లొంగిపోయే మావోయిస్టులు హైదరాబాద్ కు చేరుకున్నారని తెలిసింది.