Revanth Reddy : మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు రేవంత్ ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు

Update: 2026-02-09 07:53 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రులు, నేతలతో జూమ్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి గురించి ఆరా తీశారు. పోల్ మేనేజ్ మెంట్ జరిగేలా చూడాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

ఓటరు పోలింగ్ కేంద్రానికి తరలించేలా...
ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. క్యాడర్ తో పాటు నేతలను కూడా సమిష్టిగా కలుపుకుని ముందుకు వెళ్లాలని, ఈరోజు ప్రచారం ముగిసే సమయం వరకూ మంత్రులందరూ తమకు కేటాయించిన జిల్లాల్లోనే ఉండాలని కోరారు. పోలింగ్ కీలకం కావడంతో నేతలందరూ అందుబాటులో ఉండి పోలింగ్ సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి అన్నారు. గెలుపు లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.


Tags:    

Similar News