Hyderabad : శ్రీరామనవమి శోభాయాత్ర
శ్రీరామనవమి శోభాయాత్ర శుక్రవారం ధూల్‌పేట్ నుంచి ప్రారంభమైంది
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో శ్రీరామనవమి శోభాయాత్ర శుక్రవారం ధూల్‌పేట్ నుంచి ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాలు, శివారు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధూల్‌పేట్‌కు చేరుకుని యాత్రలో పాల్గొన్నారు. కాషాయ దుస్తులు ధరించిన యువకులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో యాత్రను ఉత్సాహంగా ముందుకు నడిపించారు. యాత్ర మార్గంలోని వీధులు, గల్లీలు కాషాయ జెండాలు, తోరణాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది.
పోలీసుల భారీ బందోబస్తు మధ్య
యాత్రలో శ్రీరాముడు, శ్రీహనుమంతుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో మార్గమంతా లువురు స్థానికులు పాల్గొనేవారికి నీరు, నిమ్మరసం, లస్సీ అందించారు. కొందరు ప్రసాదం కూడా పంపిణీ చేశారు.యాత్రలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగించగా, ఆయనపై పూలవర్షం కురిపించారు. శాంతియుతంగా యాత్ర సాగేందుకు హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. యాత్ర సజావుగా సాగేందుకు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేశారు.ఈ శోభాయాత్ర పురానాపుల్, బేగంబజార్ ఛత్రి, సిద్దియాంబజార్, గౌలిగూడ, సుల్తాన్‌బజార్ ప్రధాన మార్గాల గుండా సాగి సాయంత్రం ఆలస్యంగా కోటి హనుమాన్ వ్యాయామశాలలో ముగియనుంది.